logo

గ్రామీణ విద్యార్థినికి మొదటి ర్యాంకు

గ్రామీణ ప్రాంత విద్యార్థిని.. ప్రభుత్వ పాఠశాల విద్యా నేపథ్యం.. లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు తగినట్టు శ్రమించి ఫలితాన్ని సాధించింది. కూసుమంచి మండలంలోని చేగొమ్మకు చెందిన రెడ్డిమల్ల యమున తెలంగాణ

Published : 22 May 2024 04:07 IST

రెడ్డిమల్ల యమున

కూసుమంచి, న్యూస్‌టుడే:  గ్రామీణ ప్రాంత విద్యార్థిని.. ప్రభుత్వ పాఠశాల విద్యా నేపథ్యం.. లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు తగినట్టు శ్రమించి ఫలితాన్ని సాధించింది. కూసుమంచి మండలంలోని చేగొమ్మకు చెందిన రెడ్డిమల్ల యమున తెలంగాణ ఈసెట్‌లో ‘ఎలక్ట్రికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌’ విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. ఆంజనేయులు, ఉమా దంపతుల ఏకైక కుమార్తె యమున. పదో తరగతి వరకు చేగొమ్మలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదువుకుంది. సికింద్రాబాద్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన యమున ఈసెట్‌లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో సాధన చేసింది. ఎలక్ట్రికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ‘న్యూస్‌టుడే’కు వివరించింది.


ఈసెట్‌లో మూడో ర్యాంకు 

సాత్విక్‌ను అభినందిస్తున్న పీఆర్‌టీయూ నాయకులు 

కోక్యాతండాకు చెందిన తేజావత్‌ లక్ష్మణ్‌(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) - కవిత దంపతుల కుమారుడు సాత్విక్‌ సోమవారం వెలువడిన ఈసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనరల్‌ కేటగిరీలో మూడోర్యాంకు సాధించాడు. సాత్విక్‌ తండ్రి లక్ష్మణ్‌ జడ్పీహెచ్‌ఎస్‌ సులానగర్‌లో సోషల్‌(ఎస్‌ఏ) ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాత్విక్‌ను పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు మోతీలాల్, సంఘ నాయకులు బాలు, రమేష్, మోహన్, రాంచందర్, గణేష్‌ అభినందించారు.

టేకులపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని