logo

ప్రతిపక్షాల ఐక్యత అవసరం: కూనంనేని

దేశ సమైక్యత కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కులాలు, వ్యక్తుల మధ్య మతతత్వ భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు.

Published : 22 May 2024 04:12 IST

కొత్తగూడెంలో తీన్మార్‌ మల్లన్నను  పరిచయం చేస్తున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రఘురాంరెడ్డి

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: దేశ సమైక్యత కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కులాలు, వ్యక్తుల మధ్య మతతత్వ భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు. దేశ సంపదను కొందరి వ్యక్తుల కోసం దోచిపెట్టేలా పనిచేస్తుందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్‌ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురాంరెడ్డితో కలిసి ఈ సమావేశానికి మల్లన్నను పరిచయం చేశారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా పేరున్న తీన్మార్‌ మల్లన్నకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ అక్రమాలను ప్రశ్నిస్తే తనపై కేసులు బనాయించారని చెప్పారు. జడ్పీ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, కోనేరు సత్యనారాయణ (చిన్ని), ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, ఎడవల్లి కృష్ణ, జేవీఎస్‌ చౌదరి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని