logo

ఆతిథ్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని,  అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక అల మంగళవారం తెలిపారు.

Updated : 22 May 2024 06:43 IST

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని,  అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక అల మంగళవారం తెలిపారు. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని 26 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూడు కోర్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులుగా పేరొందిన ఐఐటీ, ఐఏఎం సంస్థల మాదిరిగా టూరిజం హాస్పిటాలిటీ కోర్సులకు ఇక్కడ శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ మూడు కోర్సులను ఈ సంస్థ అందిస్తోందని, జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 95537 00035, 94904 35240, 95537 00034 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. 

ఎంబీఏ (టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ కోర్సు)

రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు జనరల్‌ విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులతో,  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు మ్యాట్‌ లేదా క్యాట్‌/ ఐసెట్‌/ ఏటీఎంఏ లేదా తత్సమాన పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూతోపాటు గ్రూపు డిస్కషన్‌ ద్వారా ఈ కోర్సులకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. గరిష్ఠ వయో   పరిమితి లేకుండా అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం   కల్పించారు.

బీబీఏ (టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ కోర్సు)

నాలుగేళ్ల కాలవ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీఏటీ/ఏటీఎంఏ యూజీ/ఎంసెట్‌ లేదా ఎన్‌సీహెచ్‌ఎంటీ జేఈఈ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండి, వయస్సు 22 సంవత్సరాలు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీలు అయితే 25 సంవత్సరాలకు మించకూడదు. జాతీయ స్థాయిలో జరిగే ఎన్‌సీహెచ్‌ఎంటీ జేఈఈ ద్వారా నిథిమ్‌   నిర్వహించే ఏడబ్ల్యూటీ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.  

బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు)

మూడేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో చేరేందుకు టెన్‌ ప్లస్‌ టూ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఎన్‌సీహెచ్‌ఎంటీ-2023 జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్‌సీహెచ్‌ఎంటీ    వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలని కలెక్టర్‌ సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని