logo

నిప్పుల కొలిమి

ఎండ వేడితో ఖమ్మం జిల్లా గురువారం నిప్పుల కొలిమిని తలపించింది. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం అల్లాడిపోతున్నారు.

Published : 31 May 2024 01:15 IST

వైరాలో అత్యధికంగా 47 డిగ్రీలు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఎండ వేడితో ఖమ్మం జిల్లా గురువారం నిప్పుల కొలిమిని తలపించింది. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయి రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరా పట్టణంలో తొలిసారిగా 47 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ముదిగొండ మండలం పమ్మిలో 46.5, బాణాపురం 45.7, గేట్‌ కారేపల్లిలో 46.0, ఖానాపురం పోలీస్‌ స్టేషన్‌ (ఖమ్మం) 45.8, కొణిజర్ల 45.4, చింతకాని 45.2, నేలకొండపల్లి, తల్లాడ 45.1, కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదై రెడ్‌ జోన్‌కు చేరుకున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతకు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గాలిలో తేమ తగ్గి పగలు, రాత్రి వేడి గాలులు, ఉక్కపోత ఎక్కువ అవుతోంది. ఎండల ధాటికి విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది.

జిల్లాలో 40 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు ఉండగా పదకొండింటిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా మిగతా 39 స్టేషన్స్‌లో 41.1 నుంచి 44.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా తల్లాడ మండలం కుర్నవల్లిలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని