logo

పారా మిక్సో వైరస్‌ కలకలం

ఇల్లెందులో పారామిక్సో వైరస్‌ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది.

Published : 08 Dec 2023 02:53 IST

ఇల్లెందు, న్యూస్‌టుడే

ల్లెందులో పారామిక్సో వైరస్‌ (గవద బిళ్లలు) వ్యాధి విజృంభిస్తోంది. పది రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఆరు నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవద బిళ్లల సమస్య వస్తుంది. శ్వాసకోశ బిందువుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందటం ద్వారా గొంతు భాగం వద్ద వాపు ఏర్పడుతుంది. నొప్పి తీవ్రమయ్యాక పిల్లలు జ్వరం బారిన పడుతుంటారు. కొంతమందిలో తీవ్ర నీరసంతోపాటు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇల్లెందు మండలంతోపాటు.. పట్టణం, చుట్టుపక్క మండలాలైన కారేపల్లి, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి నుంచి వస్తున్న రోగులతో ఇల్లెందు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో పెద్ద ఎత్తున ఈ కేసులు నమోదవవుతున్నాయి. ప్రతి పదిమంది చిన్నారుల్లో నలుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు. వైరస్‌ ప్రభావం అధికంగా ఉండే పిల్లల్లో మెదడు వాపుతోపాటు, కడుపులో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

చాలా ఏళ్ల తర్వాత...

కొన్నేళ్ల క్రితం పారామిక్సో వైరస్‌ బాగా వ్యాప్తి చెందేది. దీని నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 9-15 నెలల్లోపు చిన్నారులకు ఎంఎంఆర్‌ అనే వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేసేవారు. తర్వాత 4 నుంచి 6 ఏళ్ల నడుమ రెండో డోస్‌ వేసేవారు. వైరస్‌ వ్యాప్తి తగ్గిపోవటంతో కొన్నాళ్ల క్రితం వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ నిలిపివేసింది.


ది రోజుల నుంచి పారామిక్సో వైరస్‌ సోకిన పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నారు. ఈ వైరస్‌ ప్రభావంతో చిన్నారులు గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. వైరస్‌ బారినపడ్డవారు సమీప వైద్యులను వెంటనే సంప్రదించాలి. వారంలో తగ్గిపోతుంది.    

మోతిలాల్‌, పిల్లల వైద్య నిపుణుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని