logo

కర్షకులకు పంట నష్ట పరిహారం అందించాలి

మిగ్‌జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్‌లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 08 Dec 2023 02:57 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ కోరారు. మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కొత్తగూడెం మంచికంటిభవన్‌లో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకేసారి భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో చేతికొచ్చిన వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 13 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. కానీ అంతకన్నా ఎక్కువగానే నష్టం జరిగిందని పోతినేని అన్నారు. బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్‌, పుల్లయ్య, జ్యోతి,   నర్సారెడ్డి, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, ధర్మా, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దీనిపై శుక్రవారం నుంచి పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామని సీపీఐ ఎం.ఎల్‌. ఎన్డీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ ప్రియాంకను గురువారం మధు ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్‌ బృందం కొత్తగూడెంలో వినతి పత్రం అందజేశారు. నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు రూ.లక్ష, వరి ఎకరాకు రూ.50 వేలు, పత్తి పంటకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన రైతుబంధు సొమ్మును జమచేయాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో తుపాకుల నాగేశ్వరరావు, పోలారం సర్పంచి సరోజిని, కందగట్ల సురేందర్‌, బట్టు ప్రసాద్‌, గౌని నాగేశ్వరరావు, ఎట్టి నరసింహారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని