logo

వర్జీనియా రైతులను ఆదుకుంటాం

తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం...

Published : 08 Dec 2023 02:58 IST

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: తుపాను ప్రభావానికి గురైన వర్జీనియా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని టొబాకో బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, పాపిడిగూడెంతోపాటు సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, కామయ్యపాలెం, రాసన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం, వరదలకు దెబ్బతిన్న వర్జీనియా పొగాకు తోటలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం పరిధిలో సుమారు 5,000 హెక్టార్లలో వర్జీనియా పొగాకు తోటలకు నష్టం వాటిల్లిందని రైతుసంఘ నాయకులు తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న తోటలకు రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.50వేలు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎం ఆదర్శయ, జంగారెడ్డిగూడెం సూపరింటిండెంట్‌ జై సురేంద్ర, క్షేత్ర అధికారులు జేసీ ప్రభాకరరెడ్డి, బాలాజీ, వెంకయ్య, రైతుసంఘ నాయకులు సత్రం వెంకట్రావు, గడ్డమణుగు సత్యనారాయణ, రెడ్డిబాబు, వేముల ప్రకాశరావు, సుంకవల్లి వీరభద్రరావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని