logo

కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల సత్తా

నాగ్‌పూర్‌లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్‌ లిఫ్టింగ్‌, వెయిట్ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్‌ లిఫ్టింగ్‌ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్‌లో పది మంది, బాడీ బిల్డింగ్‌లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు.

Published : 08 Dec 2023 03:01 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: నాగ్‌పూర్‌లో ఈ నెల 4 నుంచి జరిగిన కోలిండియా పోటీల్లో పవర్‌ లిఫ్టింగ్‌, వెయిట్ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌లో సింగరేణి క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. పవర్‌ లిఫ్టింగ్‌ పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ఆరుగురు, వెయిట్ లిఫ్టింగ్‌లో పది మంది, బాడీ బిల్డింగ్‌లో తొమ్మిది మంది పాల్గొని అయిదు స్వర్ణం, 8-వెండి, 7- కాంస్య పతకాలు సాధించారు. స్వర్ణాలు సాధించిన వారిలో ఎస్‌.శ్రీనివాసరెడ్డి, భాస్కరాచారి, అనిల్‌కుమార్‌, రామకృష్ణ, బి.వెంకటస్వామి, వెండి పతకాలను అబ్దుల్లా అహ్మద్‌, ఆనందరావు, వెంకటేశ్వర్లు, సాయిలత, ప్రకాశ్‌, అజయ్‌, మొగిలి, సత్యనారాయణ, కాంస్య పతకాలను కోమల్‌రెడ్డి, రాఘవరెడ్డి, అబ్దుల్లా అహ్మద్‌, లక్ష్మణ్‌, అనురాధ, తిరుపతి, పవన్‌కుమార్‌ గెలుచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు