logo

ఈవీఎంల భద్రతకు అదనపు గోదాం నిర్మాణం: కలెక్టర్‌

ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్‌ ప్రియాంక అల ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు.

Published : 08 Dec 2023 03:06 IST

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్‌ ప్రియాంక అల ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదాంను అధికారులతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గోదాం అవసరాలకు చాలడం లేదని తెలిపారు. అదనంగా మరొకటి నిర్మించి, ప్రస్తుత గోదాముకు కావాల్సిన మరమ్మతులు చేపట్టాలన్నారు. చుట్టూ ప్రహరీ నిర్మాణానికి¨ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భద్రపరిచిన ఈవీఏంలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పర్సా రాంబాబు, ఆర్డీఓ శిరీష, తహసీల్దార్‌ పుల్లయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లా, డీఈ నాగేశ్వరరావు, ఎన్నికల విభాగం డీటీ రంగాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  


అమర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలి

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: దేశ కోసం ప్రాణత్యాగాలకు వెరవని సైనికుల సేవలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్‌ ప్రియాంక అల అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్‌ డే) సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాజీ సైనికులు కలెక్టర్‌ ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులను స్మరించుకునేందుకు ఏటా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని  జరుపుకొంటున్నామని చెప్పారు. అమరుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. బాధిత కుటుంబ సభ్యులపై అభిమానం చాటుకోవాలని, తామున్నామనే నమ్మకాన్ని కలిగించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని