logo

Khammam: రేవంత్‌ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్‌ పాదయాత్ర

రాష్ట్రానికి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్‌ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు.

Updated : 08 Dec 2023 08:24 IST

ఖమ్మం కమాన్‌బజార్‌: రాష్ట్రానికి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్‌ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుంచి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరాడు. ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మడానికి వీలు లేదని ప్రచారం జరిగిన సమయంలో ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ని కోరుకున్నారు. సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు రేవంత్‌ మద్దతుగా నిలిచారని, అందుకే ఆయనంటే అభిమానమని తెలిపారు. శ్రీశైలం చేరుకునేందుకు 15 రోజులు పడుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని