logo

సుజాతనగర్‌ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

సుజాతనగర్‌ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పాలనలో సమన్యాయం పాటించటం లేదని, నిధుల మంజూరులో పక్షపాతం చూపుతున్నారని ఎంపీటీసీ సభ్యులు కసనబోయిన భద్రం, బత్తుల మానస, విజయ్‌, పద్మావతి, బానోత్‌ అనిత ఆర్డీఓకు ఇటీవల ఫిర్యాదు చేశారు.

Published : 28 Feb 2024 03:20 IST

సుజాతనగర్‌: సుజాతనగర్‌ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పాలనలో సమన్యాయం పాటించటం లేదని, నిధుల మంజూరులో పక్షపాతం చూపుతున్నారని ఎంపీటీసీ సభ్యులు కసనబోయిన భద్రం, బత్తుల మానస, విజయ్‌, పద్మావతి, బానోత్‌ అనిత ఆర్డీఓకు ఇటీవల ఫిర్యాదు చేశారు. డీఆర్వో రవీంద్రనాథ్‌ సమక్షంలో అవిశ్వాస పరీక్షను మంగళవారం నిర్వహించగా బత్తుల మానస, భద్రం, విజయ్‌, గణేశ్‌, అనిత, పద్మవతి హాజరై ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. భారాసకు చెందిన పెద్దమళ్ల శోభారాణీ, ఎంపీపీ విజయలక్ష్మి సమావేశానికి హాజరుకాలేదు. ఇదే పార్టీకి చెందిన గణేష్‌, బత్తుల మానస అవిశ్వాసానికి మద్దతు తెలపడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గినట్లు డీఆర్వో ప్రకటించారు.కొత్త ఎంపీపీ ఎంపిక తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

నిలబెట్టి.. పడగొట్టి..  ఎంపీపీగా విజయలక్ష్మి నాలుగేళ్ల క్రితం నాటకీయ పరిణామాల మధ్య ఎంపికయ్యారు. మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో భారాస  నాలుగు స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్‌, సీపీఐ కూటమి మూడుచోట్ల, ఓచోట స్వతంత్ర అభ్యర్థి అనిత గెలుపొందారు.  నాడు అధికారంలో ఉన్న భారాస సింగభూపాలం ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన భూక్యా విజయలక్ష్మి (కాంగ్రెస్‌), స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలిని తమవైపు తిప్పుకొంది. వారిద్దరూ చెరో రెండున్నరేళ్ల పాలించాలనే ఒప్పందం చేసుకొని ఎంపీపీగా విజయలËక్ష్మిని ఎన్నుకున్నారు. రెండున్నరేళ్లనంతరం స్వచ్ఛందంగా తప్పుకోవాల్సిన ఎంపీపీ తన పదవి నుంచి వైదొలకపోవటంతో వివాదం ప్రారంభమైంది. ఎంపీటీసీ సభ్యురాలిగా విజయలËక్ష్మిని గెలిపించిన కాంగ్రెస్‌ పార్టీయే అవిశ్వాస పరీక్ష నెగ్గడానికి వ్యూహం రచించి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు