logo

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం మొదలుకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలు ఉంటే ఒక్క ఖమ్మం నగరంలోనే 36 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయనుండటం విశేషం.

Published : 28 Feb 2024 03:28 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం మొదలుకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలు ఉంటే ఒక్క ఖమ్మం నగరంలోనే 36 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయనుండటం విశేషం. పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ‘సెంటర్‌ లొకేటర్‌ యాప్‌’ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 18,481 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,097 మంది పరీక్షలు రాయనున్నారు.  

కంట్రోల్‌ రూం ఏర్పాటు

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాల నివృత్తికి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లు లేదా ఫొటోలు, ఇతర అంశాల్లో తప్పులు దొర్లినా కార్యాలయంలో సంప్రదించి సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. నంబర్‌ 99489 04023కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని