logo

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

కార్మికుల ఆకలి బాధలు తీర్చాలని సీఐటీయూ నాయకుడు కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated : 28 Feb 2024 16:29 IST

కరకగూడెం: కార్మికుల ఆకలి బాధలు తీర్చాలని సీఐటీయూ నాయకుడు కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చిరుమల్ల ఆశ్రమ పాఠశాల వద్ద నిరవధిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు 18 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందించలేదని కొనియాడారు. తక్షణమే ప్రభుత్వం కార్మికుల సమస్యలను తీర్చాలని కోరారు. ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, హాస్టల్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని