logo

సామర్యాథ్యనికి తగ్గట్టు.. లక్ష్యం చేరేట్టు!

సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న గనులను దృష్టిలో ఉంచుకొని గతేడాది లక్ష్యం కన్నా 2 మిలియన్‌ టన్నుల బొగ్గును అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. 

Updated : 03 Apr 2024 06:28 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే

సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న గనులను దృష్టిలో ఉంచుకొని గతేడాది లక్ష్యం కన్నా 2 మిలియన్‌ టన్నుల బొగ్గును అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. వీటిలో ప్రధానంగా నైనీ కోల్‌బ్లాకు, వీకే ఉపరితలగని ఉన్నాయి. ఇవి 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల (ఫేజ్‌-1 అనుమతులు రాకపోవటం)తో జాప్యం జరిగింది.

కమిటీ సందర్శించాకే..

కొత్త ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణయించేందుకు కార్పొరేట్ కార్యాలయంలోని అధికారులతో నాలుగు నెలల క్రితమే ‘టార్గెట్ కమిటీ’ ఏర్పాటైంది. ఈ కమిటీ అన్ని గనులు, ఏరియాలను సందర్శించి అక్కడి అధికారులతో సమీక్షించింది. గనుల సామర్థ్యాన్ని బట్టి ఉత్పత్తి లక్ష్ల్యాలను నిర్దేశించింది. కొన్ని ఏరియాలకు ఉత్పత్తి లక్ష్యాలను పెంచగా మరికొన్నింటికి తగ్గించింది.


అధికారులు, కార్మికుల సహకారంతో 2023-24 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలిగాం. ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రభుత్వ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. లాభాల బాటలో సింగరేణిని నడిపిద్దాం.

 ఎన్‌.బలరాం, సింగరేణి సీఎండీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని