logo

తెదేపాలో చేరిన 15 కుటుంబాలు

పెద్దకడూరు మండలం తారపురం గ్రామంలోని 15 కుటుంబాల కార్యకర్తలు తెదేపాలో చేరారు.

Updated : 13 Apr 2024 16:53 IST

మంత్రాలయం గ్రామీణం: పెద్దకడూరు మండలం తారపురం గ్రామంలోని 15 కుటుంబాల కార్యకర్తలు తెదేపాలో చేరారు. వారిలో బజారి, రామకృష్ణ, మోహన్, వీరేష్, తిరుమల, చంద్ర, శాంతన్న, ఆనంద్, గిడ్డయ్య, లక్ష్మన్న పెద్దకడుబుర్ మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తారపురంకి చేసిన అభివృద్ధి ఏమిలేదని రాఘవేంద్ర రెడ్డి అన్నారు. అనంతరం వారిని తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తారపురం గ్రామ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ నరసింహులు, అంజినీరెడ్డి, హనుమంతు, రఘు, హనుమంతు రెడ్డి, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని