logo

అక్రమ మద్యం పట్టివేత

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన దాడుల్లో భాగంగా కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 13 Apr 2024 19:39 IST

కౌతాళం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన దాడుల్లో భాగంగా కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య, సీఐ కోసిగి ప్రసాద్‌ల ఆదేశాల మేరకు కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి బాపురం చెక్‌పోస్ట్ సమీపంలో దాడులు నిర్వహించారు. కౌతాళం మండలం, గోతులదొడ్డి గ్రామానికి చెందిన దుర్గయ్య, హనుమేష్, నగేష్‌లు రెండు మోటార్ సైకిళ్లపై అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిలో ఒకరు పరారిలో ఉన్నారు. నిందితుల నుంచి 20 బాక్సుల మద్యాన్ని, రెండు ద్విచక్ర వాహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని