logo

బైపాస్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తా

ఆదోని పట్టణంలో పదేళ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయిన బైపాస్ రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని భాజపా అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి అన్నారు.

Published : 13 Apr 2024 20:09 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో పదేళ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయిన బైపాస్ రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని భాజపా అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి అన్నారు. శనివారం బైపాస్ రహదారి భూ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా బైపాస్ నిర్మించాల్సిన చోట వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్వార్థంతో అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాల భూములు రహదారి నిర్మాణంలో కోల్పోతున్నాయి అన్నారు. పాత ఎలైన్మెంట్ ఉండగా కొత్త ఎలైన్మెంట్ మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అధికారంలోకి వచ్చిన వెంటనే తాము తేలుస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, రాష్ట్ర కార్యదర్శి సావిత్రమ్మ, దేశాయి చంద్రన్న, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని