logo

రాజీనామా చేయాలంటూ వాలంటీర్లపై ఒత్తిళ్లు

నంద్యాల పట్టణంలోని 7వ వార్డు సచివాలయం పరిధిలోని వాలంటీర్లంతా రాజీనామా చేయాలంటూ స్థానిక కౌన్సిలర్‌ షేక్‌ అబ్దుల్‌కలాం బాషా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

Published : 14 Apr 2024 03:00 IST

వాలంటీర్లతో సమావేశమైన కౌన్సిలర్‌ కలాం (సెల్‌ చూస్తున్న వ్యక్తి)

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే : నంద్యాల పట్టణంలోని 7వ వార్డు సచివాలయం పరిధిలోని వాలంటీర్లంతా రాజీనామా చేయాలంటూ స్థానిక కౌన్సిలర్‌ షేక్‌ అబ్దుల్‌కలాం బాషా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్డులో 29 మంది వాలంటీర్లు ఉండేవారు. ఈనెల 10న సచివాలయం పైన ఉన్న తన గదిలో ఆయన వాలంటీర్లతో సమావేశం నిర్వహించి 17 మందితో రాజీనామా చేయించారు. మరో 12 మంది రాజీనామా చేయలేదు. వారికి శిల్పా 7వ వార్డు (అబ్దుల్‌ కలాం) అనే వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా ఉదయం 10.30 గంటలకు సచివాలయం పైన ఉన్న తన కార్యాలయానికి తప్పకుండా రావాలని శనివారం సందేశం పంపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని