logo

బైపాస్‌ భూ బాధితులకు న్యాయం చేస్తాం

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే.. ఆదోనిలో బైపాస్‌ రహదారి భూ బాధితులకు న్యాయం చేస్తామని భాజపా ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ పార్థసారధి అన్నారు.

Published : 14 Apr 2024 03:02 IST

మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే.. ఆదోనిలో బైపాస్‌ రహదారి భూ బాధితులకు న్యాయం చేస్తామని భాజపా ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ పార్థసారధి అన్నారు. స్థానిక ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఉమ్మడి కార్యాలయంలో శనివారం బైపాస్‌ రహదారి బాధితుల సమస్యలు విన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌జైన్‌, సావిత్రమ్మ శ్రీరాములు, దేశాయిచంద్రన్న, తదితరులు పాల్గొన్నారు.

భాజపాలో చేరిక: ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ సమక్షంలో మండలంలోని కుప్పగల్లు, బసాపురం గ్రామాలకు చెందిన వంద కుటుంబాల వారు భాజపాలో చేరారు. అన్నారు.

ఆలూరు రాత మార్చుదాం: దేవనకొండ, న్యూస్‌టుడే: కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ఆలూరు నియోజకవర్గం రాత మార్చుదామని, అది తెదేపాతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన నియోజకవర్గ నాయకులు తెర్నేకల్‌ వెంకప్ప, జిల్లా ఇన్‌ఛార్జీ సురేషుబాబు, భాజాపా నాయకులు వెంకటరాముడు అన్నారు. దేవనకొండలో జనసేన ఆధ్వర్యంలో శనివారం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మాజీ బొజ్జమ్మ, బడిగించల రంగన్న, మల్లయ్య, బండ్లయ్య, రామచంద్రనాయుడు, సుధాకర్‌, జగదీశ్‌, నందు, బడేసాబ్‌, తదితరులు పాల్గొన్నారు.

వెల్దుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: తెదేపా అధికారం చేపట్టిన వెంటనే విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వెల్దుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ.శ్యాంబాబు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సుధాకర్‌తో పాటు మరికొందరు తెదేపాకు శనివారం సంఫీˆుబావం తెలిపారు. వెల్దుర్తికి చెందిన కొత్తఓటర్లు, మహిళలు మండల తెదేపా నాయకులు శివశంకరరెడ్డి, బలరాంగౌడ్‌, రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. గోవర్ధనగిరిలో వైకాపాకు చెందిన శ్రీనివాసులు, లక్ష్మన్న కుటుంబాలు మండల తెదేపా నాయకులు సుబ్బరాయుడు, గ్రామ తెదేపా నాయకులు రామచంద్రుడు, గోపాల్‌ సమక్షంలో తెదేపాలో చేరాయి.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ మండంలోని కోతిరాళ్ల, ఆర్‌.మండగిరి, జె.అగ్రహారం తదితర గ్రామాల్లో తెదేపా నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. తెదేపా సీనియర్‌ నాయకుడు కె.సాంబశివారెడ్డి నేతృత్వంలో నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి, బత్తిన లోక్‌నాథ్‌, చల్లారవి,  ఈశ్వరప్ప, బీటీ గోవిందు,  హనుమంతు, రమేశ్‌, నాగేశ్‌, శిరీష, ఉచ్చీరప్ప తదితరులు పాల్గొన్నారు.

జయహో బీసీ: తుగ్గలి, న్యూస్‌టుడే: తెదేపా బీసీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు పగిడిరాయి గ్రామంలో శనివారం జరిగిన జయహో బీసీ సదస్సులో వారు మాట్లాడారు. మాజీ ఎంపీపీ వెంకటేష్‌, పార్టీ నాయకులు తిరుపాల్‌నాయుడు, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: గోవర్ధనగిరి గ్రామంలో మండల తెదేపా అధ్యక్షుడు బలరాంగౌడ్‌ ఆధ్వర్యంలో జయహో బీసీˆ కార్యక్రమం శనివారం నిర్వహించారు. తెదేపా మండల నాయకుడు సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని