logo

జగన్‌ మాటలు.. ఉత్తి చేతలు

ఐదేళ్లు.. వారందరికీ కన్నీళ్లే. వైకాపా పాలనలో ఎసీˆ్స కార్పొషన్‌ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కనీసం పథకాలు కూడా ఎసీˆ్సలకు గుర్తులేని పరిస్థితి నెలకొంది.

Published : 14 Apr 2024 03:04 IST

 ఎసీˆ్స కార్పొరేషన్‌ నిర్వీర్యం
దరిచేరని పథకాలు

ఐదేళ్లు.. వారందరికీ కన్నీళ్లే. వైకాపా పాలనలో ఎసీˆ్స కార్పొషన్‌ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కనీసం పథకాలు కూడా ఎసీˆ్సలకు గుర్తులేని పరిస్థితి నెలకొంది. ఎంతో మంది యువత నిరుద్యోగులుగా ఉన్నా.. ఎలాంటి భరోసా కల్పించలేని పరిస్థితి. బృందాలకు సైతం రుణాలు ఇప్పించలేకపోవడంతో.. ఉపాధి వేటలో ఊరు వదిలి వెళ్తున్నారు యువతీ యువకులు. ట్యాక్సీలు కొనుగోలు చేసి ఉపాధి పొందేవారు. ప్రస్తుతం ఎక్కడా యువతకు అలాంటి సదుపాయం కల్పించడం లేదు. వైకాపా పాలనలో అత్యధికంగా దగాపడిన వారి జాబితాలో ఎసీˆ్సలు ముందు వరసలో ఉన్నారు. వారి అవస్థలు, ఆవేదనలు ఇలా పంచుకున్నారు.

రుణం వస్తుందని ట్రాక్టర్‌ కొన్నా..

సంజీవ, ట్రాక్టర్‌ యజమాని, ఆస్పరి

ఆస్పరి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం మంజూరు చేస్తుందన్న ఆశతో 2022-21లో దరఖాస్తు చేసుకున్నా. ట్రాక్టర్‌ ధర రూ7.35లక్షలు కాగా అందులో రూ.1.95 లక్షలు అప్పులు చేసి చెల్లించా. మిగతా రూ.5.50 లక్షలు నెలల అప్పులు చేసి ట్రాక్టర్‌ కంతులు చెల్లిస్తున్నాం. ఓ వైపు ట్రాక్టర్‌ కొనుగోలు చేసిన అప్పు, మరో వైపు కంతుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాô. ఎస్సీ కార్పొరేషన్‌తో మాకు నిధులు మంజూరు అయివుంటే సుమారు రూ.3.95లక్షలు రాయితీ కింద తగ్గేది. ట్రాక్టర్‌ అమ్ముకోలేక, స్థానికంగా పనులు లేక, కంతులు చెల్లించలేక.. అప్పులపాలవుతున్నా.

ఎస్సీలకు న్యాయం జరగలేదు

స్వామినాథ్‌, విరుపాపురం (ఆదోని)

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఎస్సీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఎస్సీ కార్పొరేషన్లు ఉనికి లేకుండా పోయింది. తెదేపా ప్రభుత్వంలో ఎస్సీ  యువతకు వాహనాలు తీసుకొనేందుకు రుణ సాయం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీ వీధులకు సైతం ప్రత్యేక నిధులు కేటాయించేవారు. ప్రస్తుతం అది జరగడం లేదు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు న్యాయం జరగలేదు.

శ్మశానానికి స్థలమేదీ

కృష్ణ, అల్లుగుండు (వెల్దుర్తి)

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మూడేళ్లుగా మా గ్రామానికి శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని అధికారులకు, నాయకులకు విన్నవిస్తున్నాం. ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం ఉన్న కొద్ది స్థలంలోనే గ్రామంలో ఎవరు మృతిచెందినా.. అక్కడే ఖననం చేస్తారు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని సందర్భాల్లో అస్తిపంజరాలు బయటపడుతుంటాయి. ఇది ఆవేదనకు గురిచేసే అంశం. ఎస్సీలకు ప్రత్యేక శ్మశానవాటిక కేటాయించి స్థలం మంజూరు చేయాలని కోరుతున్నా.. పట్టించుకునే వారే లేకపోయారు. మండల అధికారులతో పాటు, జిల్లా కార్యాలయంలో నిర్వహించే స్పందనలో విన్నవించిన పట్టించుకోవడం లేదు.

రుణాల ఊసే లేదు

ఇజ్రాయిల్‌, ఆదోని పట్టణం

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నా. రోజుకు ఆటో బాడుగ రూ.250 చెల్లించి, డీజిల్‌ డబ్బులు పోనూ మిగిలిన దాంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆటోల కొనుగోలుకు రుణాలు ఇచ్చేవారు. ఆపై రాయితీతో భారం తగ్గించే వారు. వైకాపా ప్రభుత్వం అలాంటి పథకాలు ఏవీ అమలు చేయడం లేదు. మాలాంటి నిరుద్యోగ యువతకు కార్పొరేషన్‌ ద్వారా రుణం ఇవ్వకపోవడం బాధాకరం.

వ్యవస్థను నిర్వీర్యం

రాజు, ఆలూరు

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎస్సీ కార్పొరేషన్‌తో యువకులు రుణాలు తీసుకుని ఉపాధి అవకాశాలు పొందే వారు. వైకాపా పాలనలో ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యం చేశారు. ఐదేళ్లలో రుణాలు, ప్రోత్సాహం అందించిన దాఖలాలు లేవు. గతంలో తెదేపా హయాంలో కార్పొరేషన్‌ ద్వారా రుణాలతో పాటు, ఉపాధి కోసం వాహనాలు మంజూరు చేశారు. స్థానికంగా పరిశ్రమలు కూడా రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని