logo

నామినేషన్ల విషయంలో అప్రమత్తత ముఖ్యం

ఎన్నికల కమిషన్‌ పలురకాల ఆంక్షలు విధించినా వాటిని లెక్క చేయకుండా అప్రజాస్వామిక విధానాలతో ఎన్నికలను నడిపించాలని జగన్‌ చూస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెదేపా జోన్‌-5 ఇన్‌ఛార్జి బీద రవిచంద్రయాదవ్‌, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 14 Apr 2024 03:05 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న బీటీ నాయుడు తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఎన్నికల కమిషన్‌ పలురకాల ఆంక్షలు విధించినా వాటిని లెక్క చేయకుండా అప్రజాస్వామిక విధానాలతో ఎన్నికలను నడిపించాలని జగన్‌ చూస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెదేపా జోన్‌-5 ఇన్‌ఛార్జి బీద రవిచంద్రయాదవ్‌, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు, న్యాయవాదులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి (తెదేపా-భాజపా-జనసేన) పార్టీల న్యాయవాదుల సదస్సు తెదేపా లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చిన్నచిన్న అంశాలను సాకుగా చూపి అధికారుల ద్వారా ప్రతిపక్ష పార్టీల వారి నామినేషన్లు తిరస్కరణ చేయించి ఏకగ్రీవాలు చేసుకున్న విషయాన్ని ఎవరూ విస్మరించొద్దని అన్నారు. అభ్యర్థులు తమ ప్రచారాల సందర్భంగా న్యాయవాదులను సైతం వెంటబెట్టుకోవాలని, ఎక్కడైనా పోలీసులు అనవసర కేసులు పెడితే వెంటనే తగిన న్యాయ సాయం పొందే వీలుంటుందన్నారు.  తెదేపా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కేఈ జగదీశ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా, మిత్రపక్ష పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ భట్‌, సురేష్‌, వై.మల్లికార్జున, ఎల్‌.వి.ప్రసాద్‌, నాగభూషణం నాయుడు, మాదన్న, మోహన్‌రావు, మురళీ మోహన్‌, రవికాంత్‌, చంద్రశేఖర్‌, తెదేపా కోడుమూరు నేత ఆకెపోగు ప్రభాకర్‌, జనసేన పార్టీల లీగల్‌ సెల్‌ అధ్యక్షులు నర్సింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని