logo

బాలనాగిరెడ్డి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి చేయని బాలనాగిరెడ్డి కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని మంత్రాలయం తెదేపా అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

Published : 14 Apr 2024 03:06 IST

నమస్కరిస్తున్న తెదేపా అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి చేయని బాలనాగిరెడ్డి కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని మంత్రాలయం తెదేపా అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్నారు. శనివారం  మండలంలోని తారాపురం గిడ్డాంజనేయ స్వామి సన్నిధి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సహకారంతో పెద్దకడబూరు మండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. తారాపురం, చిన్నకడబూరు, నౌలేకల్‌ గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. తెదేపా రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి, బసలదొడ్డి ఈరన్న,  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని