logo

పెత్తందారుల రాజ్యం పోవాలి.. ప్రజా పాలన రావాలి

రాష్ట్రంలో పెత్తందారుల రాజ్యంలో ప్రజలు విసిగిపోయారని, ప్రజా పాలన రావాలని కోరుకుంటున్నారని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు.

Published : 14 Apr 2024 03:06 IST

గోనెగండ్లలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ, కర్నూలు పార్లమెంటు అభ్యర్ధి పంచలింగాల నాగరాజు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పెత్తందారుల రాజ్యంలో ప్రజలు విసిగిపోయారని, ప్రజా పాలన రావాలని కోరుకుంటున్నారని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. శనివారం గోనెగండ్లలో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని వర్గాలను అణగదొక్కి జగన్‌మోసాలరెడ్డిగా నిలిచారన్నారు.  కర్నూలు కరవు ప్రాంతంలో ప్రజలు పడుతున్న సమస్యలను గుర్తించి, నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే  చెత్తబుట్టలో వేశారని ఎంపీ సంజీవకుమార్‌ అన్నారు.మైనార్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. వైకాపా ఐదేళ్ల పాలనలో ముస్లిం, బీసీ, ఎస్సీలపై దాడులు చేసి వారి ఎదుగుదలను నిలిపివేశారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని