logo

చేసింది కోడి గుడ్డంత.. చెప్పేది కొండారెడ్డి బురుజంత

వైకాపా పాలనలో చేసిన అభివృద్ధి కోడి గుడ్డంత అయితే.. చెప్పేది కొండారెడ్డి బురుజు అంతని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ ఎద్దేవా చేశారు.

Published : 14 Apr 2024 03:08 IST

భరోసా యాత్రలో టీజీ భరత్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో చేసిన అభివృద్ధి కోడి గుడ్డంత అయితే.. చెప్పేది కొండారెడ్డి బురుజు అంతని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ ఎద్దేవా చేశారు. నగరంలోని 14వ వార్డు బుధవారపేటలో శనివారం టీజీ భరత్‌ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరిగి తన ఆరు గ్యారంటీల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. జగన్‌ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఒక చేత్తో డబ్బులు ఇస్తూనే.. నిత్యావసర సరకుల ధరలు.. పన్నులు పెంచి మరో చేత్తో డబ్బులు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. రూ.కోట్ల నిధులతో కర్నూలును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న నేతలు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.ఏ వీధికివెళ్లినా సమస్యలు కనిపిస్తున్నాయని  ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ జకియా అక్సారీ, మాజీ కార్పొరేటర్లు ఎస్‌.అబ్బాస్‌, రామాంజనేయులు, జనసేన రాష్ట్ర ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఛైర్మన్‌ రేఖా, పవన్‌, యువ నాయకులు కరీముల్లా, రియాజ్‌,  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని