logo

నిబంధనలు వర్తించవా.. చిత్రాలు తొలగించరా

గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ పూర్తిగా అమలు కావడంలేదు. ఆదోని మండలం అరికెర గ్రామంలో నీటి ట్యాంకులకు వేసిన వైకాపా రంగులు అలాగే ఉన్నాయి. అధికారులు వాటిపై రంగులు మార్చేందుకు చర్యలు చేపట్టలేదు.  

Published : 14 Apr 2024 03:15 IST

ప్రచారంలో పాల్గొన్న వ్యాయామ అధ్యాపకుడు కంబిరెడ్డి

గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ పూర్తిగా అమలు కావడంలేదు. ఆదోని మండలం అరికెర గ్రామంలో నీటి ట్యాంకులకు వేసిన వైకాపా రంగులు అలాగే ఉన్నాయి. అధికారులు వాటిపై రంగులు మార్చేందుకు చర్యలు చేపట్టలేదు.  

న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణ: ఆదోని పట్టణంలోని అమరావతినగర్‌లో శనివారం బియ్యం బండి సరకులు పంపిణీ చేసేందుకు వచ్చింది. వాహనంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని అలాగే ఉంచారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.- న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

పత్తికొండ మండలంలోని దూదేకొండ గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం ఇది. ఎన్నికల కోడ్‌ సందర్భంగా స్థానిక అధికారులు శిలాఫలకానికి కాగితాలు అంటించినా కొందరు వాటిని తొలగించారు. శిలాఫలకంపై ముఖ్యమంత్రి జగన్‌, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చిత్రాలు కనిపిస్తున్నాయి. దిమ్మెకు వైకాపా రంగులు అలాగే వదిలేశారు.

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

ప్రచారమే.. వ్యాయామం

దోని పట్టణంలోని 20వ వార్డులో శనివారం జరిగిన వైకాపా ఎన్నికల ప్రచారంలో ఆదోని అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కంబిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నారు. వార్డులో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమార్తె గౌతమిరెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

పథకాలు గాలికొదిలేశారు

రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రోజులు గడుస్తున్నా కొన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ సరిగా అమలుకావడం లేదు. మండలంలోని చిన్నహట్య గ్రామ సచివాలయంపై నవరత్నాల ఫలకం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రం కనిపించకుండా కాగితం అతికించారు. పథకాల లోగోలు మాత్రం అలాగే వదిలేశారు.

న్యూస్‌టుడే, హొళగుంద

అనుచరుల వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌

మాజీ ఎమ్మెల్యేను అనుసరిస్తూ తిరిగే ఆయన అనుచరులు.. వారి వాహనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతికించి ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో తన వాహనానికి ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను మాజీ ఎమ్మెల్యే తొలగించుకున్నా.. ఆయన అనుచరులు మాత్రం అలానే తిరుగుతుండటం గమనార్హం. అయినా ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని