logo

రామ మంత్రం జన క్షేమం..

పెద్దల ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు పురుడుపోస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు చేపట్టారు.

Published : 17 Apr 2024 03:37 IST

సమున్నత వ్యక్తిత్వం..
తిరుగులేని నాయకత్వం..
కుదురైన ఆలోచనలు..
నీతిమంతమైన పాలన
ఒకే మాట.. ఒకటే బాణం
ప్రజల బాగోగులకు ప్రాధాన్యం.

- జగదభిరాముడి పాలన!


పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. అవి పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.

మహాత్మాగాంధీ ఆలోచన!


స్వయం ప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే ద్రవ్యోల్బణంతోపాటు అనేక ఇక్కట్లు తొలగిపోతాయి.

రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విశ్వాసం!


పెద్దల ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు పురుడుపోస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు చేపట్టారు.

కానీ నేడు ఏం జరుగుతోంది!!

‘‘మాట తప్పని కుటుంబమని చెబుతూ.. మాయమాటలే పలికారు. మడమ తిప్పని వంశమని బుకాయించి.. ప్రజలకు వెన్నుచూపారు. ఒక్క అవకాశం అని వేడుకున్నారు.. ఐదేళ్లుగా వేదనలే మిగిల్చారు. ప్రసంగాల్లో పెద్దల గురించి చెప్పే జగన్‌.. నిజ జీవితంలో జాతి నిర్మాతల ఆశయాలు, రాజ్యాంగ అధికరణలను అడుసులో తొక్కేశారు. ఊరంటే జనం కాదు.. బంధం, బంధుగణం ఐక్యతకు తార్కాణం. ఊరికి ఏం కావాలో అంతా ఏకమై చెప్పుకొనే స్వాతంత్య్రాన్ని లాక్కొన్నారు. పల్లె ఖజానాను కొల్లగొట్టి.. అభివృద్ధికి అడ్డుకట్ట వేశారు. సర్పంచులను చులకన చేశారు.. ఆటబొమ్మలుగా మార్చారు. మొత్తమ్మీద సీఎంగా జగన్‌ ఒరగబెట్టిందేమిటంటే- గ్రామ స్వరాజ్యానికి సమాధి కట్టారు. పల్లెల్లో ప్రగతి దీపాలను స్వహస్తాలతో కొండెక్కించారు.!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని