logo

రెండో రోజు 20 మంది

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు.

Published : 20 Apr 2024 05:03 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 20 మంది అభ్యర్థులు 21 నామినేషన్లు అందజేశారు.

  • కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్ట్‌) తరఫున మల్లెపోగు నాగన్న ఒక సెట్‌ నామపత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజనకు అందించారు.
  • కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామపత్రాలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి భార్గవ్‌తేజకు అందజేశారు.
  • పాణ్యం అసెంబ్లీ స్థానానికి తెదేపా తరఫున ఒకరు, ఇండియన్‌ ప్రజాబంధు పార్టీ తరఫున మల్లెపు రాజు నామపత్రాలు దాఖలు చేశారు.
  • పత్తికొండ నియోజకవర్గ స్థానానికి వైకాపా అభ్యర్థి కంగాటి శ్రీదేవి, ఆమె కుమారుడు కంగాటి రామమోహన్‌రెడ్డి రెండు సెట్ల నామపత్రాలు దాఖలు చేయగా, సీపీఐ తరఫున పి.రామచంద్రయ్య, తెదేపా తరఫున కేఈ శ్యాంబాబు ఒక్కో నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందించారు.
  • కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి వైకాపా తరఫున ఆదిమూలపు సతీష్‌ రెండు సెట్లు, కాంగ్రెస్‌ పార్టీ తరఫున పరిగెల మురళీకృష్ణ ఒక నామపత్రాన్ని ఆర్వోకు సమర్పించారు.
  • ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి భాజపా తరఫున కేఆర్‌ మురహరిరెడ్డి, మంత్రాలయం స్థానానికి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
  • ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి భాజపా తరఫున డా.పార్థసారథి, ఆలూరు నియోజకవర్గ స్థానానికి వైకాపా తరఫున విరూపాక్షి ఆర్వోకు నామపత్రాలు అందించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని