logo

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు.

Published : 20 Apr 2024 05:03 IST

 

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులుకు భార్య ఉరుకుందమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎకరం సొంత పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పంట సాగు కోసం దాదాపు రూ.5లక్షలు అప్పు చేశారు. అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ  శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని