logo

వైకాపా కార్పొరేటర్ల తిరుగుబాటు?

కర్నూలు నగరానికి చెందిన పలువురు వైకాపా కార్పొరేటర్లు శనివారం రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 19 మంది కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది.

Updated : 21 Apr 2024 09:56 IST

19 మంది రహస్య సమావేశం
జిల్లాలోని పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తి

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నగరానికి చెందిన పలువురు వైకాపా కార్పొరేటర్లు శనివారం రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 19 మంది కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ సమావేశంతో ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి వైకాపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్‌ బాషా బరిలో ఉన్నారు. స్థానిక కార్పొరేటర్లు, నాయకులకు ఆయన సరైన విలువ ఇవ్వకపోవడంతో కొందరు ఆగ్రహంతో ఉన్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే సూచనలు పాటిస్తూ తమను గుర్తించడం లేదని భావిస్తున్నారు. ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినా స్థానిక కార్పొరేటర్‌కు, వార్డులోని సీనియర్‌ నాయకులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు సైతం తమను పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల వేళ పార్టీలో విభేదాలు రావడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్ల రహస్య సమావేశానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని