logo

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు.

Published : 17 May 2024 04:27 IST

సిబ్బందికి సూచనలు చేస్తున్న కలెక్టర్‌ డా. జి.సృజన, పక్కన ఎస్పీ కృష్ణకాంత్‌, తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు. రాయలసీయ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సంబంధించిన సీసీ కెమెరాల పనితీరును జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌, జేసీ, పాణ్యం ఆర్వో నారపురెడ్డి మౌర్యతో కలిసి గురువారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద 24 గంటల పర్యవేక్షణతోపాటు భద్రత చర్యలు పటిష్టంగా ఉండాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని