logo

తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి

ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది.

Published : 17 May 2024 04:29 IST

రమేశ్‌ వీపుపై గాయం

గోపవరం (మహానంది), న్యూస్‌టుడే : ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెదేపా అనుచరుడైన చింతం రమేశ్‌, భార్య శారద, మేనత్త పుల్లమ్మతో కలిసి భైరవాణి చెరువు సమీపంలో ఉపాధి హామీ పనులకు వెళ్లామన్నారు. తిరిగి గ్రామంలోకి ద్విచక్రవాహనంపై వస్తుండగా అదే గ్రామానికి చెందిన కాగుల క్రాంతికుమార్‌, కాగుల నరసింహా, కాగుల బాబు, మల్లెల తులశమ్మ, అంజనమ్మ, సరోజ, రాములమ్మ మరికొందరు కలిసి అడ్డగించి గొడ్డలి వెనక్కి తిప్పి దాడి చేశారన్నారు. గొడవను చూసిన తన భార్యతోపాటు మేనత్త పుల్లమ్మ పరుగెత్తుకుంటూ తన వద్దకు రాగా వారిపై మట్టిగడ్డలతో దాడిచేశారని వివరించారు. తమపై దాడి చేసినవారికి, తమకు ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు లేవన్నారు. తాము తెదేపా వర్గంలో ఉన్నందుకే దాడిచేశారని రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన బాధితులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని