logo

అతిసారంతో 16 మందికి అస్వస్థత

బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

Published : 17 May 2024 04:31 IST

రోగిని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి వెంకటరమణ

బండిఆత్మకూరు న్యూస్‌టుడే: బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున 11 మందిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. దీంతో వెంటనే వైద్యులు సవితా, భావనరెడ్డి గ్రామానికి చేరుకుని ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మరో ఐదుగురికి ఇదే సమస్య ఉండటంతో వారికి అక్కడే వైద్యసేవలు అందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ యర్రగుంట్లకు వెళ్లి పరిశీలించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడంలేదని, క్లోరినేషన్‌ చేయడంలేదని గ్రామస్థులు చెప్పారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించకపోవడం కూడా ఇందుకు కారణమని ప్రజలు వాపోయారు. అనంతరం అధికారులు నీటిని పరిశీలిచేందుకు తీసుకెళ్లారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలందించి అతిసారం ప్రభలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వైద్యులకు సూచించారు. రాష్ట్రస్థాయి నిపుణులు డా.ఉమర్‌ ముక్తర్‌, భార్గవి అనంతరం గ్రామానికి వెళ్లి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు