logo

కూటమిదే అధికారం

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు.

Published : 17 May 2024 04:32 IST

మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ

కేఈ కృష్ణమూర్తిని సత్కరిస్తున్న తెదేపా నేతలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, లీగల్‌సెల్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఈ జగదీష్‌, ఎల్వీ ప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసపూరిత వాగ్దానాలిచ్చి.. ఒక్క అవకాశమంటూ ప్రజలను బతిమాలి ఎన్నికల్లో గెలిచారని.. ఆ తర్వాత రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఆయన పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పార్టీల ప్రమేయం లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ఓటమి భయంతోనే తెదేపా నాయకులు, పార్టీ సానుభూతిపరులపై వైకాపా వారు దాడులకు దిగబడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు నర్సింహులు, మైనార్టీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్షావలి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని