logo

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని ఎంపీడీవో శంకుతల అన్నారు.

Published : 17 May 2024 13:56 IST

సీ బెలగల్‌: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని ఎంపీడీవో శంకుతల అన్నారు. మండలకేంద్రమైన సీ బెలగల్‌లో శుక్రవారం మండల పరిషత్  కార్యాలయంలో ఎంపీపీ మునిప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

అనంతరం ఈవోపీఆర్డీ సందీప్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  రక్షిత మంచి పథకంలో క్లోరినేషన్‌ చేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడే  పాటించాలని సర్పంచులకు సూచించారు.  సమావేశానికి  గైర్హాజరైన మండల స్థాయి అధికారులకు నోటీసులు ఇస్తామని ఎంపీడీవో తెలిపారు. ఆదర్శ పాఠశాలల్లో సక్రమంగా వంట చేయని వంట ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సర్పంచి శ్రీనివాసులు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో-2 ఆదమ్‌ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మంగమ్మ, బీసమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని