logo

మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ

మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు.

Published : 19 May 2024 04:42 IST

కామేశ్వరి ఆలయంలో దర్శనం చేసుకుంటున్న భక్తులు  

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధికంగా రావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని