logo

తెలంగాణ ఎంసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ ఎంసెట్‌ (అగ్రికల్చర్‌)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్‌ తెలిపారు.

Published : 19 May 2024 04:46 IST

విద్యార్థులతో అధ్యాపకులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: తెలంగాణ ఎంసెట్‌ (అగ్రికల్చర్‌)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్‌ తెలిపారు. కర్నూలు ఈద్గా సమీపంలో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలో శనివారం విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్‌ విభాగంలో టి.ఫణిధర్‌ రెడ్డి 63వ ర్యాంకు, మహమ్మద్‌ ఇర్ఫాన్‌ (95), సానియా అజ్రా (174), తన్మయి (318), ఐశ్వర్య వర్మ (346), సుమయ 400వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. భావికారెడ్డి (404), అఖిల (407), రేఖాస్రవంతి (408), వైష్ణవి (409), హర్షిణి (421), గౌతమి వెంకట్‌ (499), హరిణి (501), మృదుల 582వ ర్యాంకు సాధించారని చెప్పారు. ఇంజినీరింగ్‌ విభాగంలో షాహెద్‌ అలీఖాన్‌ (240), సాకేత్‌రామ్‌ (292), వేదవ్యాస్‌ (489), సర్వజిత్‌ (878), యూనస్‌ సాకిబ్‌కు 1,929వ ర్యాంకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్లు ఆంజనేయరెడ్డి, విశ్వనాథరెడ్డి, నరసింహారావు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని