logo

చిరుజల్లులకే ఛిద్రం

కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Published : 19 May 2024 05:00 IST

 340(బి) జాతీయ రహదారికి పగుళ్లు

మల్కాపురం గ్రామ సమీపంలో వంతెన వద్ద కుంగిన రహదారి.

డోన్, న్యూస్‌టుడే: కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డోన్, బేతంచెర్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆయా ప్రాంతాలను జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో 340(బి) రోడ్డు నిర్మిస్తున్నారు.

 కొత్తపల్లె వద్ద రోడ్డు కుంగి ఇలా పగుళ్లు..

ఎన్‌హెచ్‌ 44 ప్రాంతం నుంచి ఎన్‌హెచ్‌ 40 ప్రాంతాలను కలిపేలా డోన్‌ నుంచి బేతంచెర్ల మీదుగా సోమయాజులపల్లె వరకు 52 కి.మీల వరకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల రహదారి కుంగిపోయింది. బేతంచెర్ల మండలం ఆర్‌.కొత్తపల్లెలో వంతెన వద్ద కుంగిపోయింది. తారు వేసిన చోట పగుళ్లు కన్పిస్తున్నాయి. చిన్నమల్కాపురం గ్రామ సమీపంలోని వంతెన వద్ద లోతుగా కుంగిపోయి పగుళ్లు పెద్దగా కన్పిస్తున్నాయి. రహదారి పొడవునా ఇదే పరిస్థితి నెలకొంది. వంతెన రక్షణ గోడకు బీటలు వారాయి. వంతెన చివర్లలో రహదారి కుంగిపోవడంతో రక్షణగోడలు ఓవైపు వాలినట్లు ఉన్నాయి. చిన్న వంతెనల వద్ద రహదారికి పగుళ్లు ఏర్పడటంతో డస్టుమట్టిని వేసి కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తోంది. వంతెన పనులు చేపడుతున్న ప్రాంతంలో నీరు సక్రమంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో పొలాల్లోకి వర్షపు నీరు పెద్దఎత్తున చేరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని