logo

మీటరు గిర్రు.. గుండె గుబిల్లు

ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్‌ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది.

Updated : 20 May 2024 04:31 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్‌ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్‌ నెలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదేస్థాయిలో విద్యుత్తు ‘ఖర్చు’ అయ్యింది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందెందుకు రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగించారు. ఫిబ్రవరి, మార్చి వినియోగంతో పోలిస్తే ఏప్రిల్‌లో రెండు జిల్లాలోనూ ఎక్కువగా వాడారు. దీంతో విద్యుత్తు బిల్లులూ భారీగా పెరిగాయి.

ఐదు సర్కిళ్లు.. రూ.380 కోట్ల బిల్లు

ఉమ్మడి జిల్లాలోని కర్నూలు పట్టణం, కర్నూలు గ్రామీణ, నంద్యాల, ఆదోని, డోన్‌ విద్యుత్తు సర్కిళ్ల పరిధిలో గృహ విద్యుత్తు వినియోగదారులు 11,32,405 మంది ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో విద్యుత్తు వినియోగం 18 మిలియన్‌ యూనిట్లు వరకు ఉండేది. ఏప్రిల్‌లో 20 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఫిబ్రవరిలో లోటెన్షన్‌ (ఎల్‌టీ) వినియోగదారుల మొత్తం బిల్లులు రూ.330 కోట్ల వరకు ఉంటే మార్చిలో రూ.350 కోట్లకు చేరింది. ఏప్రిల్‌లో రూ.380 కోట్ల వరకు పెరిగింది. సర్కిళ్ల వారీగా చూస్తే కర్నూలు నగరం, రూరల్‌తో పాటు నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్లలో అన్నిచోట్లా బిల్లులు భారీగా పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని