logo

అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు ఆదేశించారు.

Published : 21 May 2024 01:59 IST

మాట్లాడుతున్న డీఆర్వో మధుసూదన్‌రావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 24న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 15,981 మంది, 6,962 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. జూన్‌ 1న నిర్వహించే పదో తరగతి అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలకు 930 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని కోరారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, ఆర్‌ఐవో గురువయ్య శెట్టి, డీవీఈవో జమీర్‌ పాషా, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ స్కూల్స్‌ చంద్రకాంత్, జిల్లా ఎగ్జామినేషన్‌ కమిటీ సభ్యులు పరమేశ్వరరెడ్డి, లాలెప్ప తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని