logo

స్ట్రాంగ్‌ రూమ్‌లకు పటిష్ఠ భద్రత

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల తలుపులకు ఇనుప గ్రిల్‌ ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి చెప్పారు.

Published : 21 May 2024 02:04 IST

సీసీ కెమెరా పుటేజీ పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే : ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల తలుపులకు ఇనుప గ్రిల్‌ ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి చెప్పారు. పాణ్యం మండలంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలను సోమవారం వారు తనిఖీ చేశారు. కంట్రోల్‌ రూంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంల పర్యవేక్షణ నిమిత్తం వచ్చే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి జారీచేసిన గుర్తింపు కార్డుతో పాటు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని సూచించారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద కేంద్ర బలగాలు, ఆర్డ్మ్‌ రిజర్వు, సివిల్‌ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కళాశాలకు వెళ్లే మార్గంలో వాహనాలను తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే : జిల్లాలో ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్‌ సిబ్బందికి ఒకరోజు గౌరవ వేతనం చెల్లించాలని, డ్యూటీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, అదనపు కార్యదర్శి పుల్లయ్య, కార్యదర్శి మునిస్వామి డిమాండ్‌ చేశారు. సోమవారం వారు కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని