logo

ఎన్నికల విధులకు డుమ్మా

ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ విధులకు గైర్హాజరైన పీవోలు, ఏపీవోలపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన చర్యలకు ఉపక్రమించారు.

Published : 23 May 2024 01:38 IST

చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్‌
వంద మందిపై క్రమశిక్షణా చర్యలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ విధులకు గైర్హాజరైన పీవోలు, ఏపీవోలపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన చర్యలకు ఉపక్రమించారు. కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పీవో, ఏపీలుగా పని చేస్తున్న 17 ప్రభుత్వ శాఖల్లోని 100 మంది అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధులకు డుమ్మా కొట్టారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు పంపారు. విద్యాశాఖలో 78 మంది, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో ముగ్గురు, కాలేజియేట్‌ ఎడ్యుకేషన్, ట్రిపుల్‌ ఐటీ డీఎం, ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌ ప్రాజెక్టు, అనంతపురం తదితర శాఖల్లో ఒక్కో శాఖలో ఇద్దరు చొప్పున 8 మంది విధులకు హాజరు కాలేదు. వ్యవసాయ, పశుసంవర్దక, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్, ఉద్యాన, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, సాంకేతిక విద్య, గిరిజన సంక్షేమ శాఖ, వర్క్స్‌ అకౌంట్స్‌ తదితర శాఖల్లో ఒక్కరు చొప్పున 11 మంది కలిపి మొత్తం 100 మంది ఉన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వీరికి ఆయా శాఖల అధికారులు తాఖీదులు జారీ చేస్తున్నారు. తాఖీదులు అందుకున్న అధికారులు, ఉద్యోగులు తమ శాఖల హెచ్‌వోడీ (జిల్లా అధికారులకు) సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంది. వారిచ్చే సంజాయిషీ సరైనది కాని పక్షంలో, ఉద్దేశ పూర్వకంగానే విధులకు గైర్హాజరైన వారిపై ఆయా శాఖల అధికారులు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. విద్యాశాఖలో కొందిపై సస్పెన్ష వేటు వేసినట్లు తెలిసింది. విధులకు గైర్హాజరైన అధికారులు, ఉద్యోగులపై తీసుకున్న చర్యలను ఆయా శాఖల అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి నివేదిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని