logo

27లోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలివ్వాలి

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాజకీయ పార్టీలు ఈనెల 27వ తేదీలోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను ఫామ్‌-18లో ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి,

Published : 23 May 2024 01:44 IST

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీనివాసులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాజకీయ పార్టీలు ఈనెల 27వ తేదీలోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను ఫామ్‌-18లో ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు కోరారు. వాటి ఆధారంగా వారికి పాసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జూన్‌ 4న తొలుత పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుందని వెల్లడించారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల చరవాణులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. జూన్‌ 1 నుంచి 10వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. నలుగురికి మించి వ్యక్తులు గుమికూడరాదని సూచించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. సమావేశంలో డీఆర్వో పద్మజ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని