logo

ఈ-ఆటోల లక్ష్యానికి తుప్పు

చెత్త సేకరించి.. సంపద సృష్టించాలనే ఆలోచన పుట్టింది. రూ.లక్షలు ఖర్చుపెట్టారు.. ఆటోలు కొనితెచ్చారు.. ఆచరణ లేక తుప్పుపట్టించారు. ఇదీ ఈ-ఆటోల పరిస్థితి.

Published : 23 May 2024 02:09 IST

 కదలక మెదలక: నగరంలోని సంక్షేమ భవన్‌లో కదలని ఈ-ఆటోలు  నిర్లక్ష్యానికి వరుస కట్టాయి: నిర్వహణకు నోచుకోక ఇలా మూలకు నెట్టారు

చెత్త సేకరించి.. సంపద సృష్టించాలనే ఆలోచన పుట్టింది. రూ.లక్షలు ఖర్చుపెట్టారు.. ఆటోలు కొనితెచ్చారు.. ఆచరణ లేక తుప్పుపట్టించారు. ఇదీ ఈ-ఆటోల పరిస్థితి. కర్నూలు నగరంలోని సంక్షేమ భవన్‌లో ఈ-ఆటోలన్నీ మూలకు చేరి తుప్పుపట్టిపోతున్నాయి. కొన్ని చెత్తలో కూరుకుపోయాయి. పంచాయతీలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, మంజూరైన ఈ-ఆటోలను అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. వీటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో మూలకు చేరి, తుప్పుపట్టిపోతున్నాయి. రూ.లక్షల ప్రజాధనం కళ్లెదుటే తుప్పుపట్టిపోతోంది. ఆయా పంచాయతీల్లో చెత్త నిర్వహణ కోసం లబ్ధిదారులకు పంపిణీ చేసినా.. ఆశించిన ఫలితం లేకండాపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ-ఆటోల సంగతి ఇంతేనేమో మరి. 

ఈనాడు, కర్నూలు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని