logo

పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను జిల్లా కేంద్రంలో భద్రపర్చాలి

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టెలను నియోజకవర్గాల్లో కాకుండా జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపర్చాలని కర్నూలు పార్లమెంట్‌

Published : 23 May 2024 02:14 IST

ఎన్నికల కమిషన్, జిల్లా ఆర్వోకు తెదేపా నేతల విజ్ఞప్తి 

మాట్లాడుతున్న తిక్కారెడ్డి 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టెలను నియోజకవర్గాల్లో కాకుండా జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపర్చాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. బుధవారం తెదేపా జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను ఇప్పటి వరకు ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ తదితర నియోజకవర్గ కేంద్రాల్లోని సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఉన్నాయి.. అక్కడ సరైన భద్రత లేదన్న అనుమానాలు ఉన్నాయన్నారు. పోటీలోని అభ్యర్థుల సమక్షంలో పూర్తి స్థాయి పోలీసు భద్రతతో జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపర్చిన రాయలసీమ యూనివర్సిటీలోని ప్రత్యేక స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరచాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని