logo

సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా

జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచి గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ సి.హెచ్‌.విజయరావు ఆదేశించారు.

Published : 23 May 2024 02:22 IST

కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు

వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచి గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ సి.హెచ్‌.విజయరావు ఆదేశించారు. బుధవారం ఆయన కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి సిబ్బందికి మానిటరింగ్‌ చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులు, ఏజెంట్లు మాత్రమే ఉండాలన్నారు. పెట్రోలు బంకుల్లో క్యాన్లు, సీసాల్లో పెట్రోలు, డీజిల్‌ విక్రయించకుండా చర్యలు చేపట్టాలన్నారు. బాణసంచా విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మే 30 నుంచి జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలకు విధి నిర్వహణపై దిశా నిర్దేశం చేయాలన్నారు. సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్‌ చేయాలన్నారు. రాత్రి గస్తీ పెంచాలని, పోలీసు కంట్రోల్‌ రూంలను అప్రమత్తం చేయాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని