logo

క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉప సంచాలకులు , జిల్లా  వ్యాక్సినేషన్‌ నోడల్‌ అధికారి రామనాథరావు తెలిపారు. 

Updated : 23 May 2024 14:22 IST

చాగలమర్రి : రాష్ట్రంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉప సంచాలకులు , జిల్లా  వ్యాక్సినేషన్‌ నోడల్‌ అధికారి రామనాథరావు తెలిపారు. గురువారం ఆయన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణతో కలిసి చాగలమర్రి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా   బీసీజీ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల మందికి బీసీజీ టీకా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.18 నుంచి  60 ఏళ్లు పైబడిన వారికి జిల్లాలోని 516 సచివాలయాల పరిధిలో టీకా వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి ప్రసన్నలక్ష్మి, జిల్లా మలేరియా నివారణ అధికారి వరప్రసాద్ రెడ్డి,మండల వైద్యాధికారి ఇమ్రాన్‌, సిహెచ్‌ఓ రమణమ్మ, హెల్త్‌ఎడ్యుకేటర్‌ వెంకటమ్మ, సూపర్‌వైజర్‌ రామలింగారెడ్డి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ నాయక్‌, ఫార్మాసిస్ట్‌ రాజేష్, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని