logo

రుణం ఇప్పిస్తామని మోసం

రోజు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్న ఎరుకల వెంకటరాముడుకు ఓ మహిళ ఫోన్‌ చేసి.. మీకు మా సంస్థ నుంచి రూ.5 లక్షలు రుణం మంజూరైంది.. నీకు రుణం కావాలంటే కొంత నగదు చెల్లించాలని చెప్పారు.

Published : 25 May 2024 03:00 IST

ఆదోని వాసికి సైబర్‌ నేరగాళ్ల వల 

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: రోజు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్న ఎరుకల వెంకటరాముడుకు ఓ మహిళ ఫోన్‌ చేసి.. మీకు మా సంస్థ నుంచి రూ.5 లక్షలు రుణం మంజూరైంది.. నీకు రుణం కావాలంటే కొంత నగదు చెల్లించాలని చెప్పారు. ఇది నిజమనుకున్న వెంకటరాముడు వారు అడిగిన డబ్బులు ఫోన్‌ పే ద్వారా చెల్లించాడు.. చివరకు తనను మోసగించారని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆదోని పట్టణంలో శుక్రవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం ఇందిరానగర్‌ ఎరుకల కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకల వెంకటరాముడు  రోజు కూలీ పనులకు వెళ్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడు రోజులు కిందట ఓ మహిళా ఫోన్‌ చేసి.. తమ ఫైనాన్స్‌ సంస్థ మీ పేరుపై రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారని.. మీకు డబ్బులు కావాలంటే రుణం ఇస్తామని చెప్పారు. ఇది నిజమనుకున్న వెంకటరాముడు వెంటనే నాకు రుణం కావాలని సమాధానం ఇచ్చారు. ఇంతలోనే ముందుగా రుణం మంజూరుకు అవసరమైన ప్రాసెసింగ్‌ కోసం ముందుగా రూ.3,500 చెల్లించాలని చెప్పడంతో.. ఆయన ఫోన్‌పే ద్వారా నగదు పంపించారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఫీజుల పేరుతో ఇలా మొత్తం రూ.1.07 లక్షలు ఫోన్‌ పే చేశారు. ఆ తర్వాత రుణం డబ్బులు ఎంతకూ తన ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వెంకటరాముడు ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో దాచుకున్న రూ.1.07 లక్షల నగదు పోగొట్టుకోవడంతో వెంకటరాముడు కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని