logo

నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టాలి

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 7 గంటలకే సిబ్బంది విధుల్లో చేరాలని, నిబంధనల ప్రకారం పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు.

Updated : 25 May 2024 06:08 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 7 గంటలకే సిబ్బంది విధుల్లో చేరాలని, నిబంధనల ప్రకారం పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని జీఆర్సీ కన్వెన్షన్‌ హాలులో కౌంటింగ్‌ నిర్వహణకు సంబంధించి సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, సిబ్బంది 7 గంటలకు రాయలసీమ యూనివర్సిటీలోని కౌంటింగ్‌ హాల్‌ల్లో విధులకు హాజరు కావాలన్నారు. ప్రతి కౌంటింగ్‌ హాల్‌లో పార్లమెంటుకు 14 టేబుళ్లు, అసెంబ్లీకి 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జేసీ నారపురెడ్డి మౌర్య, ఆదోని ఆర్వో, సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ, నగర పాలక సంస్థ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, పత్తికొండ ఆర్వో, ఆర్డీవో రామలక్ష్మి, డీఆర్డీవో పీడీ, పోస్టల్‌ బ్యాలట్‌ నోడల్‌ అధికారి సలీం బాషా తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని