logo

నిరీక్షణ.. విషమ పరీక్ష

కర్నూలు పెద్దాసుపత్రికి అతిపెద్దసమస్యే వచ్చిపడింది. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో శుక్రవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది. అసలే ఎండాకాలం.. ఉదయాన్నే వెళ్తే ఇబ్బందులు ఉండవని 9:30 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నారు.

Updated : 25 May 2024 06:06 IST

విద్యుత్తు అంతరాయంతో రోగులకు నరకయాతన
ఈనాడు, కర్నూలు  

కర్నూలు పెద్దాసుపత్రికి అతిపెద్దసమస్యే వచ్చిపడింది. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో శుక్రవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది. అసలే ఎండాకాలం.. ఉదయాన్నే వెళ్తే ఇబ్బందులు ఉండవని 9:30 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నారు. సిబ్బంది వచ్చారు.. తర్వాత వైద్యులు వచ్చారు.. ఆరోగ్య సమస్యలు తెలుసుకుని పలు రకాల పరీక్షలు రాశారు. కొందరికి రక్తనమూనాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరెంటు లేకపోవడంతో పరీక్షలు నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వేచిచూడక తప్పలేదు. నిరీక్షించలేక వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. జనరేటర్‌ను అద్దెకు తెచ్చి బిగించే ప్రయత్నం చేసినా.. రాత్రి 10 గంటల వరకు కూడా సర్వజన ఆసుపత్రిలో విద్యుత్తు సమస్య పరిష్కారం కాలేదని, సిబ్బంది ప్రయత్నిస్తున్నారని   ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని