logo

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

మట్టి తరలిస్తున్న ట్రాక్టర్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో యువకుడు మృతి చెందారని హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపారు.

Published : 27 May 2024 03:05 IST

మృతదేహంతో బంధువుల ఆందోళన

రాజోలి, న్యూస్‌టుడే: మట్టి తరలిస్తున్న ట్రాక్టర్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో యువకుడు మృతి చెందారని హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ (20) గద్వాల జిల్లా రాజోలి మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. తుమ్మలపల్లి శివారులో వేగంగా వెళ్తున్న మట్టి ట్రాక్టర్‌ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు పెద్దఎత్తున తూర్పుగార్లపాడు గ్రామానికి చేరుకొని మృతదేహంతో ట్రాక్టర్‌ యజమాని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అప్పటికే ట్రాక్టర్‌ డ్రైవర్, యజమాని ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన బంధువులు సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ రత్నం తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకొని వారితో మాట్లాడారు. నిందితులు వచ్చేదాకా  ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు